నా గురించి

నవంబరు 10, 2007

 నా పేరు సుధాకర రెడ్డి.  1991 నుండి చలనచిత్ర పరిశ్రమలో ఉంటున్నాను. మొదట ఛాయాగ్రాహకుడు రసూల్ దగ్గర గాయం దగ్గర నుండి గులాబి వరకు సహాయకుడిగా చేసాను. తరువాత చాలా టెలివిజన్ ప్రదర్శనలకు ఎడిటర్ గా పనిచేసాను.  మురారి, బాబీ సినిమాలకు ఎడిటర్ గా పనిచేసాను.  ఇప్పుదు జెమినీలో ఒక క్రొత్త సీరియల్ కు దర్శకత్వం చేస్తున్నాను.  అది త్వరలో ప్రదర్శితమౌతుంది.  ఈ బ్లాగును ప్రారంభించదానికి వెనుక ముఖ్యోద్దేశం ఎమిటంటే, మన సినిమాల గురించి, తారల వ్యక్తిగత జీవితాల గురించి బోలెడన్ని పత్రికలు, వెబ్ సైట్లు ఉన్నాయి, కానీ సినిమా సాంకేతిక విజ్ఞానికి సంబందించిన  సమాచార సాధనం మాత్రం సరిగా అందుబాటులో లేదు.  ఈ జిజ్ఞాస కలవారికోసం వారి సందేహాలను తీర్చడం కోసం ఈ వేదికను నిర్మించడం జరిగింది.  త్వరలో ఒక సమగ్ర వ్యాసాన్ని ప్రచురిస్తాను. ఈలోగా ఎమైనా సందేహాలు ఉంటే ఇక్కడ నిరభ్యంతరంగా అడగవచ్చును.


Follow

Get every new post delivered to your Inbox.